హోసూరు : డిఎంకె పార్టీలో పనిచేస్తున్న వారిని ఎదగనివ్వరని హోసూరు మాజీ యూనియన్ చైర్మన్ కందప్ప ధ్వజమెత్తారు .శుక్రవారం ఆయన డిఎంకె పార్టీని వీడి ఆయన అనుచరులతో మాజీ మంత్రి బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో ఎడిఎంకె కార్యాలయంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీమంత్రి బాలకృష్ణారెడ్డి కందప్ప, అతని అనుచరులకు ఎడిఎంకె పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కందప్ప మాట్లాడుతూ హోసూరు నియోజకవర్గం ఎడిఎంకె పార్టీ పాలనలో ఎంతో అభివృద్ధి చెందిందని, దానికి మాజీమంత్రి బాలజ్రీష్ణారెడ్డి కారణమని కొనియాడారు. హోసూరు ప్రాంతంలోడిఎంకె పార్టీ అభివృద్ధికి కృషి చేశానని, అయినా పార్టీలో కష్టపడేవారిని గుర్తించకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లుగా డిఎంకె పార్టీలో పని చేసినా తనను ఎదగనివ్వక అడ్డుపడుతూ వచ్చారని ఆరోపించారు. ఎడిఎంకె పార్టీ వల్లే అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కందప్పతో పాటు ఎడిఎంకె పార్టీ పట్టణ కార్యదర్శి పాల నారాయణ, ఎడిఎంకె పార్టీ నాయకులు జయప్రకాష్, అశోకరెడ్డి, నారాయణరెడ్డి ,చంద్రన్, ఆ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.