వర్మ మరో సంచలనం..

  • In Film
  • August 27, 2019
  • 139 Views
వర్మ మరో సంచలనం..

తన కొత్త చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రానికి సంబంధించి రామ్ గోపాల్ వర్మ సాంగ్ విడుదల చేశారు. క్యాస్ట్ ఫీలింగ్ నేపథ్యంలో పాట ఉంటుందని.. పాటను ఆగస్టు 27 తేదీన విడుదల చేస్తానని ముందుగానే ప్రకటించిన వర్మ.. చెప్పినట్లుగానే చేసి చూపించారు.నాకు చాలా క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. అలా ఉండటం నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. క్యాస్ట్ ఫీలింగ్ అనేది బెటర్ ఫీలింగ్. ఎవరి కులం మీద వాళ్లకున్న ప్రేమను కుల గజ్జి అనే ఒక పరమ నీచ అసహ్యమైన పేరుతో వర్ణించేవారికి ఇదే నా సమాధానం అని రామ్ గోపాల్ వర్మ వాయిస్ తో వీడియో మొదలైంది.వందలాది కులాలు రాజ్యాంగ బద్దంగా ఉన్న దేశంలో కులం అడిగిన వాడు గాడిద లాంటి హిపోక్రసీ నిండిన కొటేషన్లను జనం మీద రుద్దే మీడియాలు ఉన్నప్పుడు.. కులానిది ఏముందండీ అంటూనే ఫలానా ప్రాంతంలో ఫలానా కులం వారి ఓట్లు ఎక్కువ కాబట్టి.. కులం వాడికే సీటివ్వాలనే రాజకీయ దగుల్బాజీలు ఉన్నపుడు.. అంటూ సంచలన పదజాలంతో వర్మ వీడియో వదిలారు..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos