న్యూ ఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో గురువారం భేటీ అయ్యారు. పార్లమెంట్ సమావే శాల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు కీలకమైన అంశాలనూ చర్చించారు. కమల్నాథ్ను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించనున్నారని వార్తలు వచ్చిన దశలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలన్నిటినీ కాంగ్రెసే సమన్వయ పరచాలని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సూచించారు. దీనికి మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ సమర్థుడని అధిష్ఠానం భావించింది. అన్ని పార్టీలతో ఆయనకు సత్సంబంధాలు ఉండడమే దీనికి కారణం. బీజేపీయేతర పార్టీలను కూడగట్టగలరన్న నమ్మకంతో ఆయన్ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించే అవకాశాలున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. బుధవారం జరిగిన కాంగ్రె స్ పార్లమెంటరీ వ్యూహ బృందం సమావేశంలో దీనితో సహా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా కమల్నాథ్ను నియమిస్తారని, సోనియాగాంధీ పూర్తి స్థాయి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.