కమల్ కేసు విచారణ 9కి వాయిదా

కమల్ కేసు విచారణ 9కి వాయిదా

న్యూ ఢిల్లీ: ప్రముఖ నటుడు, మక్కల్ నీధి మయ్యం అధ్యక్షుడు కమల హాసన్కు వ్యతిరేకంగా దాఖలైన క్రిమినల్ కేసు విచార ణను ఇక్కడి ప్రత్యేక న్యాయస్థానం వచ్చేనెల 9కి వాయిదా వేసింది. లోక్సభ ఎన్నికల సందర్భంగా తమిళనాడులో కమల్ హాస న్ ప్రచారం చేసారు. ‘ఇక్కడ చాలామంది ముస్లింలు ఉన్నారు కాబట్టి నేను ఈ విషయం చెప్పడం లేదు. మహాత్మా గాంధీ విగ్రహం ముందు నిలబడి చెబుతున్నా. స్వతంత్ర భారత దేశంలో తొలి ఉగ్రవాది ఓ హిందువు. అతడి పేరు నాథూరాం గాడ్సే’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను హిందూ సేన చీఫ్ విష్ణు గుప్త తీవ్రంగా ఆక్షేపించారు. కమల హాసన్ తమ మనో భావాలు దెబ్బ తీసి, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కమల్ హాసన్పై కేసు దాఖలు చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos