దివ్యాంగులకు కళ్యాణ లక్ష్మి సాయం పెంపు

దివ్యాంగులకు కళ్యాణ లక్ష్మి సాయం  పెంపు

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని పెంచింది. సాధారణ వారికంటే దివ్యాంగులకు 25 శాతం మొత్తాన్ని అధికంగా ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి దివ్యాంగ పెళ్లి కుమార్తె తల్లిదండ్రులకు ఈ పథకం కింద రూ.లక్షా 25 వేలా 145 ఆర్థిక సాయం అందుతుంది. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. రాష్ట్రంలో ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లల వివాహానికి ఈ పథకం కింద రూ.లక్షా 116 అందిస్తున్న సంగతి తెలిసిందే.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos