
విశాఖ పట్టణం: ఏ ముఖం పెట్టుకుని వైకాపా నేతలు ఓట్లు అడుగు తున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. గురువారం గాజువాక విధానసభ స్థానానికి నామపత్రాన్ని దాఖలు చేసిన తర్వాత మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు. ప్రతిపక్ష వైకాపా అధినేత జగన్కు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. ‘జగన్.. జాతకం ఈడీ, సీబీఐ దగ్గర ఉంది. ఆయన దోపిడీనే చేస్తారా? మనకు న్యాయం చేస్తారా? అని ప్రశ్నించారు. రాజకీయాల్లోకి జన బాహుళ్యంలో పేరు ప్రఖ్యాతులున్న నేతల్ని తీసుకొస్తానని చెప్పారు. ఇతర పక్షాల నేరగాళ్లు మీద పడి దాడికి దిగితే ఎదుర్కోడానికి జనసేన జనాదరణ కలిగిన నేతల్ని రంగంలోకి దింపుతుందని చెప్పారు.‘ జగన్, చంద్రబాబు మంచి అభ్యర్థుల్ని పోటీకి నిలిపితే పెడితే తానూ మంచి అభ్యర్థుల్నే బరిలోకి దింపుతానని పేర్కొన్నారు.