బెంగళూరు : నిదానంగా బ్యాటింగ్ చేసేందుకు బుకీల నుంచి రూ. 20 లక్షలు అందుకుని స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడన్న ఆరోపణలపై క్రికెట్ ఆట గాడు చి.ము. గౌతమ్‌ను ఇక్కడి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గురువారం అరెస్టు చేసారు. కర్ణాటక ప్రీమియర్ లీగ్ పోటీల్లో మరో క్రికెటర్ అబ్రార్ కాజీ తో కలిసి బళ్లారి టస్కర్స్ కు ప్రాతినిధ్యాన్ని వహించాడు. ఇద్దరూ కలసి స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారు. హుబ్లీతో జరిగిన పోటీలో అవినీతికి పాల్ప డి నట్లు వచ్చిన ఆరోపణలపై దర్యప్తు చేస్తున్న పోలీసులు మొదట కాజీని, ఆ తర్వాత గౌతమ్ ను బంధించారు. వీరికి డబ్బులిచ్చిన బుకీలను గుర్తిం చేందుకు విచారిస్తున్నారు.