తన పెళ్లి గురించి వస్తున్నవార్తలకు ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫుల్ స్టాప్ వేసింది. కొద్ది సేపటి క్రితం తన ట్విట్టర్ ద్వారా కాజల్ తన పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 30న గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలిపింది. కరోనా మహమ్మారి వలన కొద్ది మంది సభ్యుల మధ్య పెళ్లి చేసుకోబోతున్నట్టు పేర్కొంది. ఇన్నేళ్ళ నా ప్రయాణంలో నాకు మద్దతుగా నిలుస్తూ నాపై ప్రేమను చూపిస్తున్న మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు అని కాజల్ పేర్కొంది. కాగా, ముంబయిలోని ప్రఖ్యాత ఏడునక్షత్రాల హోటల్‌లో ఈ జంట వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం.కాజల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, కమల్ హాసన్ ఇండియన్ 2లలో నటిస్తుంది. వీటితో పాటు విష్ణు మోసగాళ్లు, జాన్ అబ్రహాంతో ఓ చిత్రంలోనూ ఆమె నటిస్తున్నారు. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ నటించి మెప్పంచారు.
— Kajal Aggarwal (@MsKajalAggarwal) October 6, 2020