డేహరాడూన్: పిథోర్‌గఢ్ జిల్లాలో మంగళవారం భారీగా కొండ చరియలు విరిగిపడటంతో వందలాది మంది కైలాస మానస సరోవర్ యాత్ర యాత్రికులు అక్కడ చిక్కుకుపోయినట్లు తెలిసింది. అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దారికి అడ్డుగా పడిన బండరాళ్లను తొలగించి రహదారి పునరుద్ధరణకు కృషి చేస్తున్నారు. పర్వత ప్రాంతం కావడంతో సహాయక చర్యలకు సాంకేతికంగా అవాంతరాలు ఎదురవుతున్నాయి. విపత్తు నిర్వహణ బృందాలు యాత్రికులను సురక్షితంగా బయటకు తీసుకుని వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.