కాబూల్ : తమ హక్కులకు రక్షణ కల్పించాలని మహిళా బృందం బహిరంగంగా డిమాండ్ చేసింది. తాలిబన్ల వశమైన ఆఫ్ఘన్ నుండి వేలాది మంది ఇతర దేశాలకు పారి పోతున్న సమయంలో కాబూల్ వీధుల్లో ఒక మహిళా బృందం ధైర్యంగా తమ ఆందోళనను తెలిపింది. తాలిబన్ దేశంలో ఇదే మొదటి మహిళల అందోళన కావడం గమ నార్హం. సంబంధిత వీడియోను ఇరాన్ జర్నలిస్ట్ మాసిహ్ అలిన్జాద్ పోస్ట్ చేశారు. తాలిబన్ సైన్యం చుట్టుముట్టినప్పటికీ నినాదాలు అట్టల్ని నలుగురు మహిళలు ప్రదర్శిం చిన దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. సామాజిక భద్రత, పని, విద్య, రాజకీయంలో భాగస్వామ్యం, మహిళల హక్కులను కాపాడాలని డిమాండ్ చేసారు. కొన్నేళ్ల పాటు తాము సాధించిన విజయాలను, ప్రాథమిక హక్కులు రాజీపడ కూడదని వారు పిలుపు నిచ్చారు. ఆఫ్ఘన్లోని ప్రథాన మీడియా సంస్థ టోలో న్యూస్ దేశం తాలిబన్ల వశం కావడంతో తొలగించిన మహిళా యాంకర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవడం గమనార్హం.