దక్షిణాది హీరోలు, సౌత్ ఇండస్ట్రీపై జ్యోతిక సంచలన వ్యాఖ్యలు

దక్షిణాది హీరోలు, సౌత్ ఇండస్ట్రీపై జ్యోతిక సంచలన వ్యాఖ్యలు

ముంబై:ప్రముఖ నటి జ్యోతిక మరోసారి దక్షిణాది సినీ పరిశ్రమపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక్కడి సినిమా పోస్టర్లలో హీరోయిన్లకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శించారు. పోస్టర్లలో కేవలం హీరోలు మాత్రమే కనిపిస్తారని అన్నారు. ఇటీవల ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, ఈ అంశంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.బాలీవుడ్, మలయాళ చిత్ర పరిశ్రమల్లో తనకు లభించిన గౌరవాన్ని జ్యోతిక ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. హిందీలో తాను నటించిన ‘సైతాన్’ సినిమా పోస్టర్‌ను అజయ్ దేవగన్ తన సోషల్ మీడియాలో పంచుకున్నారని తెలిపారు. అలాగే, మలయాళంలో సూపర్‌స్టార్ మమ్ముట్టితో నటించిన ‘కాథల్-ది కోర్’ చిత్ర పోస్టర్‌లోనూ తన ఫోటో ఉందని, ఆ పోస్టర్‌ను మమ్ముట్టి కూడా షేర్ చేశారని ఆమె వివరించారు. అయితే, దక్షిణాదిలో పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉందని జ్యోతిక ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇక్కడ ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి పనిచేశానని, కానీ ఏ ఒక్క హీరో కూడా హీరోయిన్ ఫొటో ఉన్న పోస్టర్‌ను తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ఆసక్తి చూపలేదని అన్నారు. “దక్షిణాది సినిమా పోస్టర్లలో కేవలం హీరోలే కనిపిస్తారు, హీరోయిన్ల ఫొటోలు ఉండవు” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హీరోయిన్లకు దక్కుతున్న ప్రాధాన్యతపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. జ్యోతిక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos