కాంగ్రెస్ పార్టీకి సింధియా దూరం

కాంగ్రెస్ పార్టీకి సింధియా దూరం

న్యూఢిల్లీ: మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖుడు జ్యోతిరాదిత్య సింధియా సోమవారం తన ట్విట్టర్ ఖాతా వ్యక్తిగత వివరాల నుంచి కాంగ్రెస్ పార్టీ పేరును తొలగించారు. ప్రజాసేవకుడు, క్రికెట్ ప్రేమికుడని పేర్కొన్నారు. ఇది రాజకీయాల్లోవర్గాల్లో చర్చనీ యాం శమైంది.‘నెల రోజుల కిందటే దాన్ని నేను మార్చాను. ప్రజల సూచనతోనే తన వ్యక్తిగత వివరాల్ని సంక్షిప్తీకరించా. ఇం దు లో రాజకీయాలు లేవు. వందతుల్ని నమ్మొద్ద’ని కోరారు. మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్, సీనియర్ నేత దిగ్విజ య్ సింగ్ తెర వెనక రాజకీయాలతో విసుగు చెందిన ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిసింది. మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ సారథిగా జ్యోతిరాదిత్య సింధియాకు బదులుగా . దివంగత నేత అర్జున్ సింగ్ తనయుడు అజయ్ సింగ్ పేరును తెరపైకి తీసుకు రావడంతో ఆయన ఆలోచనల్లో పడ్డారని తెలిసింది. రాహుల్ గాంధీ జట్టులో కీలక నేతగా పేరుపడ్డ జ్యోతిరాదిత్య సింధియా తీసుకున్న తాజా నిర్ణయం చర్చనీయాంశమైంది.ఇటీవల భాజపా నిర్ణయాలపై సానుకూల దృక్పథాన్ని కనబరచిన ట్వీట్లు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos