జువ్వల దిన్నెలో చేపల రేవు ఏర్పాటు ఎప్పుడు?

జువ్వల దిన్నెలో చేపల రేవు  ఏర్పాటు ఎప్పుడు?

జువ్వల దిన్నెలో చేపల రేవు ఏర్పాటు ఎప్పుడు?
నెల్లూరు: ఇక్కడకు సమీపంలోని జువ్వలదిన్నె లో చేపల రేవును ఎప్పుడు నిర్మించినున్నారని ఆదాల ప్రభాకర్ రెడ్డి మంగళవారం లోక్సభలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీని నిర్మాణానికి అడ్డంకులు ఏమిటి?ఎందుకు ఆలస్యం అవుతోంది; ఏ మేరకు నిధులు కేటాయించారని, ఎప్పుడు పూర్తవుతుందని ప్రశ్నించారు. దీనికి కేంద్ర మత్స్య, పాడి పరిశ్రమ శాఖ మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి రాత పూర్వకంగా జవాబిచ్చారు. ‘జువ్వలదిన్నె చేపల రేవు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ సాంకేతిక, ఆర్థిక అంశాలతో కూడిన వివరాలతో నివేదిక అందించింది.నిర్మాణ వ్యయం రూ.288.80 కోట్లు. కేంద్రం వాటారూ.144 . 40 కోట్లు. కేంద్ర మత్స్య, పాడి పరిశ్రమ శాఖ ఈ ప్రతిపాదనను ఆర్థిక శాఖకు పంపింద’ని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos