న్యూ ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ సంక్షోభం అంశం విచారణలపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే ఇచ్చింది. ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీ పిటిషన్ని విచారించింది. దీనితో ముడిపడి ఉన్న ఇతర వ్యాజ్యాలపై ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలను నిలిపి వేసింది. న్యాయ మూర్తులు రాకేష్ కుమార్, ఉమాదేవి ధర్మాసనం జారీ చేసిన ఆదేశాలు, విచారణను తప్పు పట్టింది. అవి ఆందోళనకరంగా ఉన్నాయనపి వ్యాఖ్యా నించింది. రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందని జస్టిస్ రాకేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సరి కాదని అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎస్ బోబ్డే తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యాజ్యాన్ని వ్యతిరేకించిన న్యాయవాది సిద్దార్థ లూథ్రాపైనా సుప్రీం మండిపడింది. ‘మీరు ఎన్నాళ్ల నుంచి ప్రాక్టీసు చేస్తున్నారు. గతంలో ఇలాంటి ఆదేశాలు ఎప్పుడైనా ఇచ్చారా’ని ప్రశ్నించింది. హెబియస్ కార్పస్ వ్యాజ్యాలపై విచారణకు అనుమ తించా లన్న ఆయన అభ్యర్థననీ తిరస్కరించింది. రాజ్యంగం సంక్షోభంలో ఉందనే భావనతో జడ్జి ప్రభావితం అయినందున అన్ని విచారణలపైన స్టే విధి స్తున్నా మని సుప్రీంకోర్టు వెల్లడించింది. సెలవుల తర్వాత తదుపరి విచారణ చేస్తామని తెలిపింది.