అమరావతి: ‘జగన్ మోహన్ రెడ్డిలో ఫైడల్ కాస్ట్రో విధానాలు కనిపిస్తున్నాయ’ని మాజీ ఎమ్మెల్సీ, ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు వ్యాఖ్యానించారు. మంగళవారం ఇక్కడ ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైకాఈపా కండువా కప్పుకున్న తర్వాత ప్రసంగించారు. ‘జగన్ ఆలో చన, ప్రభుత్వ పనితీరు తనకు ఎంతగానో నచ్చింది. పదేళ్లుగా ప్రజా సమస్యలపై పోరాటం చేసిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. దళితు లకు, గిరిజన,మైనార్టీలకు పెద్ద పీట వేశారు. నిర్దిష్ట ఆలోచన సరళి లేని మేము గొర్రెల్లగా పక్కదారి పట్టాం. అందరితో కలసి నేనూ తెదూపాలో చేరా. జగన్ మోహన్ రెడ్డిలో ఫెడరల్ కాస్ట్రో విధానాలు కనిపిస్తుయి. జగన్ పాలనను ప్రజలు స్వాగతిస్తున్నారు. పదవులు ఆశించి పార్టీ మారలేదు. కేవలం సైనికుడిలా నేను వైకాపాలో చేరా. రాజకీయంగా నేను చేసిన న కొన్ని తప్పులను సరిదిద్దుకుంటాన’న్నారు.