చెన్నై: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని సీబీఐ అధికారులు గోడ దూకి అరెస్టు చేయటం దేశానికే సిగ్గుచేటని డిఎంకె అధినేత స్టాలిన్ గురువారం ఇక్కడ వ్యాఖ్యానించారు. సిబిఐ అధికార్లు గోడ దూకి చిదంబరం నివాసంలోకి వెళ్లడాన్ని తాను కూడా చూశానన్నారు. ముందస్తు బెయిల్ కోసం విజ్ఞప్తి చేసినా అరెస్టు చేయటాన్ని ఖండించారు. చిదంబరాన్ని సీబీఐ అధికారులు కొంత సేపటి కిందటే న్యాయస్థానానికి తరలించారు.