ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలతో విలవిల్లాడుతున్న మాజీ సీఎం చంద్రబాబుకు నందమూరి అభిమానులు మరో గుబులు పుట్టించారు.ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోగా కొనసాగుతున్న తారక్ అభిమానులు పెద్ద సంఖ్యలో వైసీపీలో చేరడం చంద్రబాబుకు గుబులు పుట్టిస్తోంది. వందలాది మంది తారక్ ఫ్యాన్స్ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి మరీ వైసీపీలో చేరారు. కర్నూలు నగర శివారు నుంచి నగరంలోని లక్ష్మీ ఫంక్షన్ హాల్ దాకా భారీ ర్యాలీగా తరలివచ్చిన వీరికి కర్నూలు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి సాదర స్వాగతం పలికారు.ఒకరు కాదు… ఇద్దరు కాదు… ఏకంగా 1500 మంది వైసీపీలో చేరారు. వీరిలో తారక్ ఫ్యాన్స్ తో పాటు తారక్ సోదరుడు కల్యాణ్ రాం ఫ్యాన్స్ కూడా ఉన్నారట. న్టీఆర్ ఎన్కేఆర్ టైగర్ టీం జిల్లా అధ్యక్షుడు బోయపాటి మధు ఆధ్వర్యంలో తారక్ కల్యాణ్ రాం అభిమానులు 1500 మంది వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.ఇప్పటికే తారక్‌కు ఆప్తమిత్రుడైన కొడాలి నాని వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతుండగా మరో ఆప్తమిత్రుడు వల్లభనేని వంశీ సైతం వైసీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే..