అరవింద సమేతతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని ఇచ్చిన దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మరోసారి నటించడానికి ఎన్టీఆర్ సిద్ధమవుతున్నాడు. అలవైకుంఠపురం చిత్రంతో పాత త్రివిక్రమ్ ఫామ్‌లోకి రావడంతో అలకు మించిన హిట్‌ను తనకిస్తాడనే నమ్మకంతో ఎన్టీఆర్ త్రివిక్రమ్‌తో సినిమా చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నాడని సమాచారం. అలాగే ఎన్టీఆర్ తనకి ఇస్తున్న ప్రాముఖ్యతతో ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి త్రివిక్రమ్ సైతం ఆసక్తిగా ఉన్నాడట.ఇప్పటికే ఎన్టీఆర్ కి ఆయన ఒక లైన్ వినిపించడం .. ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందని సమాచారం.పూర్తి స్క్రిప్ట్ ను ఏప్రిల్ నాటికి సిద్ధం చేసుకుని సెట్స్ పైకి వెళ్లేలా త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట.వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ కథలో కూడా యాక్షన్ పాళ్లు తక్కువ .. ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్.. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తాయని.. 2021 సంక్రాంతి కి ఈ సినిమాను బరిలో నిలిపే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు.