కశ్మీరీ యువతులతో పెళ్ళి- బీహార్ అన్నదమ్ములకు లొల్లి

కశ్మీరీ యువతులతో పెళ్ళి- బీహార్ అన్నదమ్ములకు లొల్లి

సుపౌల్:కశ్మీరీ అక్క చెల్లెళ్లను పెళ్లాడిన ఇద్దరు బీహారీ సోదరులు ఇబ్బందుల్లో పడ్డారు. నాలుగేళ్లుగా కశ్మీర్లో కార్మికులుగా పని చేస్తున్న సోదరులు- మొహమ్మద్ తబ్రేజ్ (26), మొహమ్మద్ పర్వేజ్ (24) అక్కడి యువతుల్ని ప్రేమించారు.వారితోకలసి సహజీవనాన్ని కూడా చేసారు. కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు కావటంతో వివాహానికి ఉన్న అడ్డంకులు తొలగి పోయాయి. దరిమిలా ఆ జంటలు పెళ్లాడాయి. బీహార్లోని సుపౌల్లోని తమ ఇంట్లో కాపురాల్ని ప్రారంబభించారు. ఇది సామాజిక మాధ్యమాలు, సాధారణ మాధ్యమాల్లో సంచలన మయ్యాయి. దీన్ని మరోలా అర్థం చేసుకున్న యువతుల తండ్రి తమ బిడ్డల్ని అపహరించుకు పోయారాని పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో మొహమ్మద్ తబ్రేజ్ (26), మొహమ్మద్ పర్వేజ్ (24)ను కశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేసి సుపౌల్ కోర్టులో ప్రవేశపెట్టారు. తాము మేజర్లమేనని, తమ ఇష్టపూర్వకంగానే వారిని పెళ్లాడామని యువతులు తమ వాంగ్మూలంలో పేర్కొన్నారు. తమను వదిలిపెడితే భర్తలతో కలిసి జీవిస్తామని వేడుకున్నారు. కోర్టు మాత్రం వారిని ట్రాన్సిట్ రిమాండ్పై తీసుకెళ్లేందుకు కశ్మీర్ పోలీసులకు అనుమతిచ్చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos