లండన్ : ప్రపంపచ కప్పు క్రికెట్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఆదివారం జరుగనున్న మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు కొత్త జెర్సీలో దర్శనమివ్వనున్నారు. ఆ జెర్సీలతో జట్టు సభ్యులు ఫోజులిచ్చిన ఫొటోలు ఎటు చూసినా దర్శనమిస్తున్నాయి. క్రికెట్ ప్రపంచ కప్పు ఈ ఫొటోలను ట్విటర్‌లో షేర్ చేసింది. ఇప్పటి వరకు ప్రపంచ కప్పులో భారత్, ఇంగ్లండ్ జట్ల ఆటగాళ్లు నీలి రంగు జెర్సీలను ధరించేవారు. ఇప్పుడు ఇరు జట్లూ తలపడనున్నందున, ఒక జట్టు విధిగా జెర్సీలను మార్చుకోవాల్సి ఉంటుంది. ఆతిథ్య జట్టుకు సహజంగానే వెసులుబాటు ఉన్నందున, ఇంగ్లండ్ ఆటగాళ్లు పాత జెర్సీలనే ధరించనున్నారు. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు ముదురు నీలం, నారింజ రంగులతో కూడిన జెర్సీలను ధరించనున్నారు.