హోసూరు : స్థానిక అప్పావు పిళ్ళై స్వచ్ఛంద సంస్థ, హోసూరు మైక్రో ల్యాబ్స్ కంపెనీ యాజమాన్యం సంయుక్తంగా 650 మంది పారిశుద్ధ్య కార్మికులకు జర్కిన్‌లు, కరోనా నియంత్రణ మాత్రలను పంపిణీ చేశాయి. హోసూరు కామరాజ కాలనీలో గల కె.ఎ.పి. కళ్యాణ మంటప ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హోసూరు కార్పొరేషన్ కమిషనర్, మైక్రో ల్యాబ్స్ మేనేజరు పాల్గొని 650 మంది వీటిని పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే కేఏ. మనోహరన్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనేక మంది పాల్గొన్నారు.