విశాఖ వాసులకు అందుబాటులో ఉంటా

విశాఖ పట్టణం:విశాఖ పట్టణ వాసులకు 24 గంటలు అందుబాటులో ఉంటానని బాండ్ పేపర్ మీద రాసిచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని లోక్సభ నియోజక వర్గ జనసేన అభ్యర్థి సిబిఐ మాజీ సంయుక్త సంచాలకులు జె.డి. లక్ష్మీనారాయణ స్పష్టీకరించారు. శుక్రవారం నామ పత్రాల్ని దాఖలు చేసిన తర్వాత మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు. తాను పూర్తి కాలం రాజకీయాలకు కేటాయిస్తానన్నారు. మాఫియా మద్దతు పొందిన నాయకులు కావాలో లేక సమర్థ వంతమైన నాయకులు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా మని భరోసా ఇచ్చారు. ‘ఇతర రాజకీయ పక్షాలు డబ్బులు ఇచ్చి ముందుకు వస్తే.. జనసేన ఆ గబ్బును వదిలిం చడానికి ముందుకు వచ్చిందని’ వ్యాఖ్యానించారు. భూ కబ్జాల వల్లే విశాఖ పేరు మరోలా మారి పోయిందని ఆక్రోశించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos