అమరావతి:కొందరు తెదేపా నేతలు భాజపాతో సంప్రదింపులు జరుపుతున్నారనేది నిజమని తెదేపా సీనియర్ నేత దివాకర రెడ్డి వెల్లడించారు. సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘ కొందరు నేతలు భాజపాతో మంతనాలు సాగిస్తున్నారనేది నిజం. అయితే నేను రాజకీయాలకు గుడ్బై చెప్పా. ఇక పార్టీ ఎలా మారతాను? అని ఎదురు ప్రశ్న వేసారు. ఎన్నికల ఫలితాల అనంతరం భాజపా నేతలు ఎవరూ తనను సంప్రదించలేదని తేల్చి చెప్పారు. పార్టీ బలోపేతానికి భాజపా నేతల ప్రయత్నాల్ని తప్పు పట్టలేమన్నారు.