
న్యూ ఢిల్లీ : ఒకప్పటి ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద మంగళవారం ఇక్కడ భాజపా నేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఉత్తర ప్రదేశ్లోని రాంపూర్ లోక్‌సభ స్థానం నుంచి సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత ఆజాంఖాన్కు వ్యతిరేకంగా బరిలోకి భాజపా అభ్యర్థిగా దిగనున్నట్లు పార్టీ వర్గాల కథనం. పార్టీ వ్యతిరేక కార్య కలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆమెను సమాజ వాది పార్టీ నుంచి నాయకత్వం బహిష్కరించింది. అనంతరం ఆమె మరో ప్రముఖుడు అమర్ సింగ్ తో చేతులు కలిపి రాష్ట్రీయ లోక్మంచ్ పేరుతో సొంత పార్టీ పెట్టారు. తెలుగుదేశం పార్టీ వ్యవ స్థాపకుడు రామారావు ఆహ్వానానికి స్పందించి 1994లో రాజకీయాల్లో ప్రవేశించారు.