కొల్హాపూర్: ఆపదలో అండగా నిలిచినవాడు దేవుడిగా మారిపోతాడు. ఇందుకు ఇక్కడుంది మరో నిదరర్శనం. మహారాష్ట్ర దానికి వేదిక. కొల్హాపూర్ జిల్లా వరదలతో అతలాకుతలమైంది. జనజీవనం స్తంభించింది. మారుమూల గ్రామాల్లోని ప్రజలు వరదనీటిలో చిక్కుకుపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. చుట్టూ నీరు. ప్రాణాలపై ఆశలు కోల్పోయిన వారికి జవాన్లు అండగా నిలిచారు. పడవల్లో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ సందర్భంగా ఓ మహిళ తమను కాపాడిన జవాన్లకు చేతులెత్తి దండం పెట్టి. వారి పాదాలను తాకి కన్నీటి పర్యంతమైంది. ఆమె చూపిన కృతజ్ఞతాభావానికి అక్కడున్న వారి కళ్లూ చెమ్మగిల్లాయి. ఈ దృశ్యం అక్కడున్న కెమేరాల కంటికీ చిక్కింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో సంచలనమైంది.