
శ్రీనగర్: జమ్మూ-కశ్మీర్ ఉద్దంపూర్‌లోని 187వ బెటాలియన్ క్యాంపు జవాను అజిత్ గురువారం సహనాన్ని కోల్పోయి సహచరులపై విచక్షణా రహితంగా కాల్పులు జరపటంతో మరో ముగ్గురు జవాన్లు- యోగేంద్ర శర్మ(డిల్లీ), ఉమెద్ సింగ్ (హర్యాన), పొకర్మాల్ ( రాజస్థాన్) అక్కడి కక్కడే కుప్పకూలారు. అనంతరం తనూ అదే తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. తుపాకి మోత విన్న ఇతర జవాన్లు ఘటనా స్థలానికి చేరుకుని అజిత్‌ను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇప్పుడు అతని ఆరోగ్య పరిస్థతి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాల్పులకు ముందు మృతులు, అజిత్ మధ్య వాగ్వాదం జరిగినట్లు అధికార్లు తెలిపారు.