కేంద్ర మంత్రికి కరోనా

కేంద్ర మంత్రికి కరోనా

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ బీభత్సం సృష్టిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరిని మహమ్మారి తన గుప్పిట్లోకి లాక్కుంటోంది. ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, యూపీ సీఎం ఆదిత్యనాధ్, కేరళ సీఎం పినరాయి విజయన్‌ సహా పలువురు నేతలకు కరోనా పాజిటివ్ తేలగా.. తాజాగా ఈ జాబితాలో కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ కూడా చేరారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. శుక్రవారం రోజు కరోనా పరీక్షలు చేసుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. గత రెండు మూడు రోజుల నుంచి తనను కలిసిన వారు తప్పనిసరిగా కోవిడ్ టెస్ట్ చేసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు. కర్ణాటక ముఖ్యమంత్రి రెండో సారి కరోనా బారిన పడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos