వాషింగ్టన్: నగరంలో ఈ నెల 9న జరగనున్న ఐక్యారాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో ఇరాన్ విదేశాంగ మంత్రి మ హ్మ ద్ జావద్ జరీఫ్ పాల్గొనకుండా అమెరికా అడ్డుకుంది. ఈ సమావేశం కోసం కొన్ని వారాల కిందట జరీఫ్ దరఖాస్తు చేసిన వీసాను తిరస్కరించినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ సమాచారాన్ని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్కు ఫోన్ ద్వారా తెలిపినట్లు వివరించారు. ఐరాస సమావేశాలకు విదేశీ ప్రతినిధులను అమెరికా తప్పనిసరిగా అనుమతించాలని 19 4 7 నాటి ‘హెడ్క్వార్టర్స్ అగ్రిమెంట్’ చెబుతోందని విశ్లేషకులు తెలిపారు.