టోక్యో : జపాన్ కు చెందిన 116 ఏళ్ల బామ్మ తనాకా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు. 1903 జనవరి 2న ఆమె జన్మించారు. తల్లిదండ్రుల ఎనిమిది మంది సంతానంలో ఆమె ఏడో వ్యక్తి. 1922లో ఆమె వివాహం చేసుకుంది. ఫుకువోకా అనే పట్టణంలో ఆమె నివసిస్తున్నారు. ప్రస్తుతం ఓ నర్సింగ్ హోమ్లో ఉన్నారు. గిన్నీస్ బుక్ ప్రతినిధులు శనివారం ఆమె వద్దకు వెళ్లి గిన్నీస్ రికార్డు పత్రాలను అందజేశారు.