జకర్తా: ఇండోనేషియా ఇండోనేషియాలోని బాలీ, జావా ద్వీపాలపై గురువారం రెండు భూకంపాలు విరుచుకు పడ్డాయి. వీటి తీవ్రత భూకంప మాపనం పై 6.2 గా నమోదైంది. రెండు దీవుల్లోని పలు భవనాలు కంపించాయి. ప్రజలు ప్రాణ భీతితో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.పుర్వడోయి ప్రాం తా నికి ఈశాన్య దిశలో 148 కి.మీల దూరంలో భూకంపం కేంద్రీకృతమై ఉందని విపత్తు నిర్వహణ విభాగం ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సంభ వించిన ప్రాణ, ఆస్తి నష్టాలపై ఇంకా స్పష్టత రాలేదు.