10 జన్‌పథ్ చాణక్యుడు అహ్మద్ పటేల్

10 జన్‌పథ్ చాణక్యుడు అహ్మద్ పటేల్

న్యూ ఢిల్లీ: అహ్మద్ పటేల్. సోనియా గాంధీ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుకా ఆయన మాస్టర్ మైండ్ ఉంటుంది. రాజకీయ ప్రత్యర్థుల కీలెరిగి వాత పెట్టడంలో ట్ట. కాంగ్రెస్లో సమస్యల పరిష్కర్త దివంగత నేత ప్రణబ్ ముఖర్జీ తో సమ ఉజ్జీగా పేరు సంపాదించుకున్నారు. కాంగ్రెస్ సంక్లిష్టాల తుఫానులో చిక్కుకున్నపుడల్లా బయటికి కనిపించకుండా చిక్కుల్ని విప్పి సోనియాకు ఊరట నిచ్చిన చాణుక్యుడు. సోనియా గాంధీపై, కాంగ్రెస్పై ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎంత విరుచుకుపడ్డా ఎదురు నిలిచి, వాటి వేడి సోనియాకు తాకకుండా వీరోచితంగా నిలబడిన యోధుడు. ముందు నుంచీ గాంధీ పరివారానికి అత్యంత విశ్వసాపాత్రునిగా సేవలందించారు. ఏ విషయన్నయినా, ఎంతటి నాయకుడైనా అహ్మద్ పటేల్కు చెబితే చాలు సోనియా గాంధీకి చెప్పినట్లే. తాలూకా స్థాయి రాజకీయాల నుంచి ఎదిగిన వ్యక్తి. 26 ఏళ్ల ప్రాయంలోనే ఏకంగా లోక్సభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి కన్నుమూసే వరకూ ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ గుజరాత్లో కాంగ్రెస్ జెండాను ఎగరేశారు. అప్పటి నుంచి గాంధీ పరివారానికి ఆప్తుడయ్యాడు. గాంధీ కుటుంబానికి చెందిన మూడు తరాలతో పని చేశారు. ఒక్క సారి కూడా మంత్రి వర్గంలో చేర లేదు.అహ్మద్ పటేల్దంతా తెరవెనుక మంత్రాంగమే. రాజీవ్ గాంధీ మరణం తర్వాత పీవీ నరసింహా రావు, ప్రణబ్ ముఖర్జీ, చెన్నారెడ్డి, అర్జున్ సింగ్ లాంటి దురంధరుల నియంత్రణలో సోనియా గాంధీకి అండగా నిలబడ్డారు. సోనియా పార్టీపై పట్టు పెంచుకోవడం వెనుక ఉంది అహ్మద్ పటేలే.
మాజీ ప్రధాని నెహ్రూ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ‘జవహర్ భవన్’ ను సిద్ధం చేయాలని రాజీవ్ గాంధీ పురమాయించి నపుడు నేతలు ఎవ్వరూ పట్టించుకోలేదు. విసుగు చెందిన రాజీవ్ ఆ బాధ్యతను అహ్మద్ పటేలపై మోపారు. దీన్ని విజయవంతంగా నిర్వహించి గాంధీ పరివారానికి మరింత ఆప్తు డయ్యారు. 10 జన్పథ్లో అహ్మద్ పటేల్ ఎంత అంటే అంతే. ‘‘భారత్ వెలిగిపోతోంది’’ అంటూ అప్పటి ప్రధాని వాజపేయ్ ప్రచారాన్ని తుత్తునీయలు చేసి…. అదంతా అబద్ధ మని, కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని మొదట అంచనా వేసింది అహ్మద్ పటేలే. ఈ మాటలను మిగితా అధిష్ఠానం పెద్దలు అంతలా విశ్వసించ లేదు. ఈ ప్రచారం మొదటికే మోసం వస్తుందని అహ్మద్ పటేల్పై విరుచుకు పడ్డారు. అయినా సరే సోనియాను ఒప్పించి, ఉద్ధృతంగా ప్రచారం చేయించి కాంగ్రెస్ను అధికార పీఠంపై కూర్చోబెట్టారు. కుమారుడ్ని మాత్రం అహ్మద్ పటేల్ రాజకీయాల్లోకి తీసుకురా లేదు. అహ్మద్ పటేల్ లేని లోటును కాంగ్రెస్లో ఎవరు భర్తీ చేస్తారన్నది వేచి చూడాల్సిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos