జమ్ము : జమ్ముకాశ్మీర్‌ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. మంగళవారం నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉదంపూర్- రాంబన్ల మధ్య కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు. దీంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని వరుసగా మూడవరోజు గురువారం కూడా మూసివేశామని అన్నారు. జాతీయ రహదారిని మూసివేయడంతో సుమారు 500నుండి 600కు పైగా వాహనాలు మార్గమధ్యలో వివిధ ప్రదేశాలలో చిక్కుకున్నాయి. కాశ్మీర్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే ఏకైక రహదారి ఇదే. 270 కి.మీ పొడవైన ఈ రహదారిపై ఉదంపూర్‌లోని జఖేని మరియు చెనాని మధ్య అనేక చోట్ల కొండచరియలు విరిగిపడటంతో మూసుకుపోయిందని అన్నారు. జమ్మూలోని నగ్రోటా నుండి రియాసి, చెనాని, పట్నిటాప్, దోడా, రాంబన్, బనిహాల్ మరియు శ్రీనగర్ నుండి ఎటువంటి వాహనాలను అనుమతించడం లేదని అన్నారు. కాత్రా మరియు ఉదంపూర్ పట్టణాలకు చెందిన యాత్రికులు తమ గుర్తింపు కోసం ఫొటో ఐడి కార్డులు తమ వద్దే ఉంచుకోవాలని, అప్పుడే ప్రయాణం సజావుగా సాగుతుందని అన్నారు.మంగళవారం కురిసిన క్లౌడ్ బరెస్ట్ , ఆకస్మిక వరదలు కారణంగా ఏర్పడిన అడ్డంకులను తొలగించడానికి యంత్రాలు, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బిఆర్ఒ) సిబ్బంది యత్నిస్తున్నారని అన్నారు. అలాగే కిష్త్వార్-సింథాన్-అనంతనాగ్ హైవేను సైతం మూసివేసినట్లు తెలిపారు. వాతావరణం అనుకూలించి, రహదారుల పరిస్థితి మెరుగ్గా ఉండి, బిఆర్ఒ నుండి గ్రీన్‌సిగల్ వస్తే.. శ్రీనగర్-సోనామార్గ్-గుమారి నుండి ట్రాఫిక్‌ను అనుమతించే అవకాశం ఉందని పేర్కొంది. సోనామార్గ్ నుండి కార్గిల్ వైపు ఎల్ఎంవి(లైట్ మోటార్ వెహికల్స్, హెచ్ఎంఆర్( హెవీ మోటార్ వెహికల్స్)ను ఉదయం 11.30 గంటల నుండి సాయంత్రం 5.30 వరకు అనుమతించాలని పేర్కొంది. కట్ ఆఫ్ సమయం తర్వాత ఏ వాహనాన్ని అనుమతింకూడదని వెల్లడించింది. శ్రీనగర్ నుండి కార్గిల్ వరకు శ్రీనగర్ నుండి కార్గిల్ వరకు ప్రయాణించే భద్రతా దళాల కాన్వాయ్‌లతో పౌరులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రకటన పేర్కొంది.