
శ్రీనగర్ : భద్రతాబలగాలు ఎంతగానో గాలిస్తున్న ఉగ్రవాది, జైషే మహ్మద్ కు చెందిన ఫయాజ్ అహ్మద్ లోనేను జమ్మూ-కశ్మీర్, ఢిల్లీ ప్రత్యేక పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఫయాజ్ అహ్మద్ ఆచూకీ చెప్పినా, అతని తల తెచ్చి ఇచ్చినా రెండు లక్షల రూపాయల నగదు బహుమతి ఇస్తామని ఢిల్లీ పోలీసులు గతంలో ప్రకటించారు. ఉగ్రవాది ఫయాజ్ అహ్మద్ నిర్బంధానికి న్యాయ స్థానం గతంలోనే నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.