ట్రంప్ ‘మధ్యవర్తిత్వం’ వ్యాఖ్యలపై మోదీ స్పందించరా

ట్రంప్ ‘మధ్యవర్తిత్వం’ వ్యాఖ్యలపై మోదీ స్పందించరా

న్యూ ఢిల్లీ:భారత్, పాక్ కాల్పుల విరమణకు తానే మధ్యవర్తిత్వం వహించానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చేస్తున్న వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఎప్పుడు స్పందిస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. తానే మధ్యవర్తిత్వం చేశానని ట్రంప్ బల్లగుద్ది చెప్పుకుంటున్నా మోదీ స్పందించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని పేర్కొంది. ఈమేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎక్స్​ వేదికగా పోస్ట్ పెట్టారు.భారత్ – పాక్ కాల్పుల విరమణకు తానే మధ్యవర్తిత్వం వహించానని ట్రంప్ చెప్పుకుంటున్న ఒక వీడియో క్లిప్‌ను తన ట్వీట్‌కు జైరాం రమేశ్ జతచేశారు. ‘గత 21 రోజుల్లో మోదీ గొప్ప స్నేహితుడు ట్రంప్ ఈవిషయాన్ని చెప్పుకోవడం 11వసారి. ఇంతకీ దీనిపై ప్రధాని ఎప్పుడు మాట్లాడుతారు ?’ అని ఈ ట్వీట్‌లో ఆయన ప్రశ్నించారు. అమెరికా వాణిజ్య శాఖ మంత్రి కూడా ఈవిషయాన్ని మే 23న న్యూయార్క్‌లోని కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్‌లో చెప్పారని జైరాం రమేశ్ గుర్తు చేశారు. అయినప్పటికీ డొనాల్డ్ భాయ్ స్నేహితుడైన నరేంద్రమోదీ ఈ అంశాన్ని పట్టించుకోనట్టుగా వదిలేసి, మౌనం వహిస్తున్నారని పేర్కొన్నారు. ఇంతకీ దీనిపై ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడటం లేదో అర్థం కావడం లేదన్నారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos