పిల్లల చదువును ధ్వంసం చేస్తున్న విద్యాశాఖ

పిల్లల చదువును ధ్వంసం చేస్తున్న విద్యాశాఖ

న్యూఢిల్లీ : పాఠశాలలు ప్రారంభమై నెలరోజులు గడుస్తున్నా ఇప్పటికీ పాఠ్య పుస్తకాలు అందించక పోవడంతో కేంద్రంపై కాంగ్రెస్ మండిపడింది. విద్యా శాఖ విద్యార్థుల చదువును నాశనం చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ధ్వజ మెత్తారు. నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్టిఎ) పరీక్షల నిర్వహణను విధ్వంసం చేస్తే.. నాన్ బయోలాజికల్ పిఎంకి చెందిన విద్యాశాఖ పిల్లల చదువును నాశనం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఫల్యం చాలా తీవ్రంగా ఉందని, అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రం ప్రతి రోజూ కొత్త ఎత్తుగడలను పన్నుతోందని అన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ ఎన్సిఇఆర్టి 6వ తరగతికి చెందిన మ్యాథ్స్, సైన్స్, సోషల్ నూతన టెక్స్ట్ బుక్స్ను ముద్రించడంలో విఫలమైందని అన్నారు. నేషనల్ సిలబస్ అండ్ టీచర్ లెర్నింగ్ మెటీరియల్ కమిటీ (ఎన్ఎస్టిసి) ఇంకా పాఠ్యపుస్తకాలను ఖరారు చేయలేదని, టెక్స్ట్ బుక్స్ ముద్రణకు మరో 10-15 రోజులు పట్టవచ్చని అన్నారు. విద్యార్థులకు కొత్త పుస్తకాలు అందుబాటులోకి తీసుకురావడానికి రెండు నెలలు ఆలస్యం కావచ్చని అధికారులు అంచనావేస్తున్నారని అన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం ఢిల్లీ సమావేశంలో కొత్త పాఠ్యాంశాల ముసాయిదా (ఎన్సిఎఫ్)కి అనుగుణంగా పాఠ్యపుస్తకాల అభివృద్ధిని సమీక్షించిన సంగతి తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos