24 లక్షల మంది భవితవ్యానికి భరోసా ఏదీ..?

24 లక్షల మంది భవితవ్యానికి భరోసా ఏదీ..?

న్యూ ఢిల్లీ: నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్ధుల భవితకు భరోసా ఎవరని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ప్రశ్నించారు. నీట్ అక్రమాలపై విద్యార్దులు ఆందోళన చెందుతూ నిరసన బాట పట్టారని అన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై పలు ప్రశ్నలు రేకెత్తుతున్నాయని అన్నారు. ప్రభుత్వ ఏజెన్సీల్లో నియామకాల కోసం నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని నెలకొల్పుతామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని, కానీ ఇప్పటివరకూ ఆ ఏజెన్సీ ద్వారా ఒక్క నియామకం కూడా చేపట్టలేదని పేర్కొన్నారు. యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్ కేంద్రంగా ఎడ్యుకేషన్ స్కామ్లు జరిగాయని రాహుల్ గాంధీ చెబుతున్నారని, ఈ మూడూ బీజేపీ పాలిత రాష్ట్రాలేనని జైరాం రమేష్ గుర్తుచేశారు. తాము నీట్కు వ్యతిరేకమని మహారాష్ట్ర, తమిళనాడు చెబుతున్నాయని అన్నారు. పార్లమెంట్ లో నీట్పై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. నీట్ నిర్వహణలో ఎన్టీఏ, కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యాయని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos