మసకబారిన ఇమేజ్‌ను కాపాడుకునేందుకే జీ7 సదస్సుకు మోదీ

మసకబారిన ఇమేజ్‌ను కాపాడుకునేందుకే జీ7 సదస్సుకు మోదీ

న్యూ ఢిల్లీ: మసకబారిన తన అంతర్జాతీయ ఇమేజ్ను కాపాడుకునేందుకే ప్రధాని నరేంద్ర మోదీ జీ 7 సదస్సుకు హాజరవుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు. 2007లో ఇదే సదస్సుకు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ వెళ్లిన విషయాన్ని ప్రస్తావిస్తూ మోదీ దిగజారిన తన అంతర్జాతీయ ప్రతిష్టను కాపాడుకునేందుకే ఈ సదస్సుకు వెళుతున్నారని చెప్పారు. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ విషయ పరిజ్ఞానంతో గ్లోబల్ సౌత్ వాణిని వినిపించే నేతగా ఎదిగారని, సొంత డబ్బా కొట్టుకోవడం ద్వారా కాదని మోదీని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ జీ7 సదస్సులో పాల్గొనేందుకు గురువారం ఇటలీ వెళుతున్నారు. మోదీ వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా పాలనా పగ్గాలు స్వీకరించిన అనంతరం చేపట్టిన తొలి విదేశీ పర్యటన ఇదే కావడం గమనార్హం.1970ల నుంచి అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్, జపాన్ దేశాధినేతలతో జీ7 భేటీ జరుగుతోందని, 2003 నుంచి జీ7 సదస్సులకు భారత్, చైనా, బ్రెజిల్, మెక్సికో, దక్షిణాఫ్రికాలను కూడా ఆహ్వానిస్తున్నారని జైరాం రమేష్ గురువారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. జూన్ 2007లో జర్మనీలో జరిగిన జీ7 సదస్సులో ప్రపంచ వాతావరణ మార్పులపై మన్మోహన్ సింగ్, జర్మనీ ఛాన్స్లర్ ఏంజిలా మెర్కెల్ ఫార్ములా చారిత్రాత్మకమైనదిగా పేరొందిందని కాంగ్రెస్ నేత గుర్తుచేశారు. మసకబారిన తన అంతర్జాతీయ ప్రతిష్టను మెరుగుపరుచుకునేందుకు జీ7 సదస్సుకు వెళుతున్న ప్రధాని మోదీ నుంచి ఈ ఘన చరిత్రను అంగీకరించడాన్ని ఆశించలేమని వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos