న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్‌కు ఢిల్లీ న్యాయస్థానం గురువారం బెయిల్ మంజూరు చేసింది. తనకు వ్యతిరేకంగా కథనాన్ని ప్రచురించిన ‘ది కారవాన్’పై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ కుమారుడు వివేక్ పరువు నష్టం దావా వేసారు. దరిమిలా నిర్వహించిన విలేఖరుల సమావేశంలో జై రామ్ రమేశ్, పత్రికా యాజమాన్యం పత్రికలో తనపై వచ్చిన ఆరోపణలను పదేపదే ప్రస్తావించార వివేక్ పేర్కొన్నారు. ‘తన తండ్రి పై ప్రతీ కారాన్నితీర్చుకునేందుకే’ ఉద్ధేశపూర్వకంగా తన ప్రతిష్టకు భంగం కలిగించారని ఆరోపించారు. ఈ కేసులో ఇంతకు ముందు జై రాం రమేశ్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చిన కోర్టు మే 9న కోర్టులో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో గురువారం ఆయన విచారణకు హాజరయ్యారు. రూ.20 వేల వ్యక్తిగత పూచీకత్తుతో ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.