మరో భారీ చిత్రంలో మాజీ సీఎం కొడుకు..

  • In Film
  • January 22, 2020
  • 186 Views
మరో భారీ చిత్రంలో మాజీ సీఎం కొడుకు..

జాగ్వార్‌ అనే భారీ బడ్జెట్‌ చిత్రంతో తెలుగు-కన్నడ చిత్రపరిశ్రమలకు ఒకేసారి పరిచయమైన కర్ణాటక మాజీ సీఎం తనయుడు నిఖిల్‌ గౌడ జాగ్వార్‌ చిత్రం డిజాస్టర్‌ కావడంతో అనంతరం కేవలం కన్నడ పరిశ్రమకే పరిమితమయ్యాడు.కన్నడలో పలు చిత్రాల్లో నటించిన నిఖిల్‌ తెలుగులో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాలు మాత్రం వదులుకోలేదు.తాజాగా ఓ భారీ సినిమాకు శ్రీకారం చుట్టాడు. టాలీవుడ్ దర్శకుడు విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్ డ్రామాలో నటించబోతున్నాడు. రోజు నిఖిల్ జన్మదినం సందర్భంగా సినిమా ప్రకటన వచ్చింది. సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో నిఖిల్ ఒక స్పోర్ట్స్ జెర్సీ ధరించి బాస్కెట్ బాల్ పోస్ట్ దగ్గర నిలుచున్నాడు. గోల్ కొట్టిన వారు సంతోషం వ్యక్తం చేసినట్టుగా రెండు చేతులో చాపి నిలుచున్నాడు. సినిమాతో లహరి మ్యూజిక్ వారు సినీ నిర్మాణంలోకి అడుగుపెడుతున్నారు. సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తారని సమాచారం. కన్నడతెలుగు ద్విభాషా చిత్రంగా సినిమా తెరకెక్కనుంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos