మహారాష్ట్ర వరదల్లో జగిత్యాల వాసుల గల్లంతు

మహారాష్ట్ర వరదల్లో జగిత్యాల వాసుల గల్లంతు

జగిత్యాల: మహారాష్ట్రలోని ఉద్గార్ వద్ద వరద ప్రవాహంలో కారు కొట్టుకుపోవటంతో నలుగురు గల్లంతయ్యారు. వారిని జగిత్యాల జిల్లాకు వాసులుగా  పోలీసులు గుర్తించారు. వారిలో ఒక బాలుడి ఆచూకీ లభ్యమైందని తెలిపారు. హసీనా, సమీనా, అఫ్రిన్ అనే మరో ముగ్గురు మహిళల కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. మహారాష్ట్రకు వెళ్లి అక్కడి నుంచి కారులో జగిత్యాలకు తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక అధికారులు, రెస్క్యూ టీమ్స్‌ గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos