సంచలన వ్యాఖ్యలకు కేంద్రబిందువైన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అంతా అనుకున్నట్లు తాను కోటీశ్వరుడు కాదని తనకు ఊరంతా అప్పులే ఉన్నాయంటూ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తన వద్ద చాలా డబ్బుందని అందరూ అనుకుంటూ ఉంటారని కానీ కార్యకర్తలు, నాయకులే తనకు అప్పులు ఇస్తుంటారని ఆ డబ్బుతోనే రాజకీయాలు చేస్తున్నానని అన్నారు. కార్యకర్తల వైద్యానికి, వారి పిల్లల పెళ్లిళ్లకూ చేసే సాయం ఈ డబ్బులతోనేనని అన్నారు. మొత్తం మీద తనకు రూ. 100 కోట్ల వరకూ అప్పులున్నాయని ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు.ఎవరెవరి వద్ద ఎంత డబ్బు తీసుకున్నానో గుర్తుంచుకున్నానని అన్నారు. కొంతమందిని వేదికపైకి పిలిచి “నీ వద్ద ఎంత తీసుకున్నాను?” అని అడిగి వారితో సమాధానం చెప్పించారు. మొన్న జరిగిన దసరా పండగకు తాను దాదాపు కోటి రూపాయల వరకూ ఖర్చు చేశానని జగ్గారెడ్డి చెప్పారు