ఏడాదికి పైగా పాదయాత్ర,నేతలతో సమావేశాలు,మంతనాలతో తదతర రాజకీయ వ్యవహారాలతో తీరికలేకుండా గడిపిన వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి వారం రోజుల పాటు లండన్ పర్యటనకు వెళ్లడానికి సిద్ధమయ్యారు.గత నెలలోనే లండన్ పర్యటనకు వెళ్లడానికి సిద్ధమైనా అపుడు రాష్ట్ర రాజకీయాల్లో్ చోటు చేసుకున్న పరిణామాల కారణంగా పర్యటన వాయిదా వేసుకున్నారు.వైసిపి అధినేత జగన్ లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు షరతులతో అనుమతిచ్చింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ సంస్థలో చదువుతున్న తన కుమార్తెను కలిసేందుకు బ్రిటన్ వెళ్లేందుకు అనుమతించాలని అభ్యర్థిస్తూ ఆయన పిటిషన్ వేశారు. దీంతో ఈనెల 18 నుంచి మార్చి 15వ తేదీ మధ్య 10 రోజులపాటు ఆయన లండన్ లో పర్యటించేలా.. ఏడాది కాలపరిమితికి పాస్‌పోర్టు జారీచేయాలని పాస్‌పోర్టు అధికారులను కోర్టు ఆదేశించింది. లండ న్‌లో పర్యటించే ప్రదేశాలు, ల్యాండ్ ఫోన్, సెల్ నంబర్, ఈ-మెయిల్, ఫ్యాక్స్ నంబర్ తదితర వివరాలను కోర్టుతోపాటు సీబీఐ అధికారులకు సమర్పించాలని షరతు పెట్టింది.ఇప్పుడు ఎన్నికల ప్రచారం ప్రారం భించే ముందే ఆయన కుమార్తె వద్దకు వెళ్లనున్నారు. ఆ తరువాతే అభ్యర్దుల ప్రకటన.. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్దుల విషయంలో జనగ్ ఓ నిర్ణయానికి వచ్చేసారు. అయితే, ఇతర పార్టీల నుండి వచ్చే కీలక నేతల వ్యవహారంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. ఎవరు వస్తారనే విషయంలో స్పష్టత వస్తే ఇక అభ్యర్దులను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడదల అయ్యే అవకాశం ఉంది. దీంతో.. ఈ లోగానే లండన్ పర్యటన ముగించుకొని ఆ వెంటనే అభ్యర్దుల ను ప్రకటించే యోచనలో జగన్ ఉన్నారు.