వైఎస్ జగన్ బాటలో యడియూరప్ప..

వైఎస్ జగన్ బాటలో యడియూరప్ప..

స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలంటూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పలు రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్న తెలుగు ప్రజలపై ప్రభావం చూపనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.వైఎస్‌ జగన్‌ తీసుకున్నట్లే కర్ణాటక రాష్ట్ర ముఖ్యంత్రి యడియూరప్ప సైతం కొత్తగా స్థాపించనున్న కంపెనీల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలనే ప్రతిపాదన చేయనున్నట్లు సమాచారం.కర్ణాటక రాష్ట్ర ప్రజల అభిప్రాయం కూడా ఇదేనని అందుకే ఉద్యోగాల్లో 75శాతం స్థానికులకు ఇవ్వాలనే ప్రతిపాదనతో యడియూరప్ప ముందుకు వెళ్లనున్నట్లు సమాచారం. ఇక స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని కర్ణాటక రాష్ట్రంలో ప్రజలు కూడా పెద్ద ఎత్తున నిరసనకు దిగే ఆలోచనలో ఉన్నారు. ఇక వీరికి మద్దతుగా ప్రముఖ సినీ నటుడు ఉపేంద్ర ఈ ఆగష్టు నెల 14,15 తారీఖుల్లో జరగబోయే ఉద్యమంలో పాలుపంచుకోనున్నారు .ఇప్పటికే ఈ ఉద్యమానికి కూడా కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఒకవేళ ఇదే కానీ జరిగితే తమ పరిస్థితి ఏంటి అని బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్న తెలుగు వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కర్ణాటక తరహాలోనే తమిళనాడు ప్రభుత్వం కూడా ఇటువంటి నిర్ణయం తీసుకుంటే తమ పరిస్థితి ఏంటని ఆయా రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్న తెలుగు ప్రజలు మధనపడుతున్నట్లు సమాచారం..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos