ఆయన ఉయ్యాలవాడ నరసింహారెడ్డే…

ఆయన ఉయ్యాలవాడ నరసింహారెడ్డే…

అమరావతి : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీనియర్ నటుడు చిరంజీవిని తొలి స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో పోల్చారు. చిరంజీవితో తాను గడిపిన క్షణాలను తన ఫేస్‌బుక్‌ ద్వారా షేర్ చేశారు. ‘సైరా నరసింహారెడ్డిని కలుసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. చిరంజీవి ఇలాంటి సంతోషకరమైన జ్ఞాపకాలను తమకు ఇస్తూనే ఉండాలని ఆకాంక్షించారు. జగన్, చిరంజీవి సోమవారం భేటీ అయిన విషయం తెలిసిందే. వీరి సమావేశంపై అటు రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చలు నడిచాయి. భేటీ తర్వాత చిరంజీవి మీడియాతో సమావేశమై, వివరాలు వెల్లడిస్తారని వైసీపీ, మెగాస్టార్ అభిమానులు ఎదురు చూశారు. అయితే మెగాస్టార్ మాత్రం మీడియాతో ఎలాంటి విషయాలు చెప్పలేదు. అయితే వీరి భేటీలో కేవలం సైరా సినిమా గురించే ప్రస్తావన వచ్చినట్లుగా తెలుస్తోంది. ‘సైరా నరసింహారెడ్డి’ చిత్ర విశేషాలను జగన్‌కు మెగాస్టార్ వివరించారు. సైరా చిత్రం చూడాలని సీఎంను కోరారు. కుటుంబ సమేతంగా సైరా మూవీని చూస్తామని చిరంజీవి దంపతులకు జగన్ మాటిచ్చినట్లు సమాచారం. సైరా మూవీ విడుదలైన తర్వాత చిరంజీవి ఇద్దరు ప్రముఖులను కలుసుకున్నారు. మొదటగా తెలంగాణ గవర్నర్ తమిళిసైని కలిశారు. సైరా మూవీ తప్పకుండా చూడాలని కోరారు. అయితే ఆమె కూడా కుటుంబ సమేతంగా సినిమాను చూస్తానని హామీ ఇచ్చి, అనుకున్నట్లుగానే గవర్నర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ‘సైరా నరసింహారెడ్డి` సినిమాను తిలకించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos