అమరావతి : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నటుడు చిరంజీవి అపాయింట్‌మెంట్ ఖరారైంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు జగన్‌తో చిరంజీవి, రామ్ చరణ్ భేటీ అవుతారు. తాను కథానాయకుడిగా నటించిన చరిత్రాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డిని వీక్షించడానికి రావాల్సిందిగా సీఎం జగన్‌ను చిరంజీవి కోరనున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చిరంజీవి తొలిసారి ఆయనతో భేటీ కాబోతున్నారు. ‘సైరా’ సినిమాను వీక్షించాల్సిందిగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను చిరంజీవి ఇటీవల కోరడం, ఆమె కుటుంబంతో కలిసి సినిమా చూసి అద్భుతంగా ఉందంటూ ప్రశంసించిన విషయం తెలిసిందే.