అమరావతి :ఓటమి భయంతోనే జగన్ అరాచకాలకు పాల్పడు తున్నారన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు.మంగళవారం ఇక్కడి నుంచి తెదేపా నేతలతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు.జాబితా నుంచి తెదేపా ఓటర్ల పేర్లు తొలగింపు,కుల రాజకీయాలు,ఎన్టీ ఆర్ విగ్రహాలు ధ్వంసం చేయటం ఇందుకు తిరుగులేని నిదర్శనమని వ్యాఖ్యానించారు. నేరగాళ్ల ఆలోచనలు నిరంతరం నేరాలపైనే ఉంటాయన్నారు.గుంటూరులో నాలుగు చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలు ధ్వంసం చేశారని ఆగ్రహించారు.మోదీ, కేసీఆర్, జగన్ అరాచకాలకు ప్రజలే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని అన్నారు.ఆంధ్రప్రదేశ్ని సామంత రాజ్యం చేయాలనేదే కేసీఆర్ కుట్ర అని ఆరోపించారు.జగన్ను లొంగదీసుకునొ ఆంధ్రప్రదేశ్‌పై దాడులకు పాల్పడినట్లు దుయ్యబట్టారు.ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక మూలాలపై దాడులు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. వ్యక్తులు, సంస్థలకు అత్యంత కీలకమైన సమాచారానికి హైదరాబాద్లో రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు.భవిష్యత్తులో ఎవరైనా సమాచారాన్ని హైదరాబాద్లో భద్ర పరుస్తారాని ప్రశ్నించారు.అహం భావంతో కేసీఆర్, అసహనంతో జగన్ తమకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకొని హద్దులు దాటి వ్యవహరిస్తున్నారని తప్పు బట్టారు.తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు రెండున్నర దశాబ్ధాల పాటు శ్రమించి సమీకరించిన సమాచారాన్ని దొంగిలించి వైకాపాకి ఇచ్చారని ఆరోపించారు. పార్టీ సమాచారాన్ని ప్రభుత్వ సమాచారంగా తప్పుడు ప్రచారాల్ని చేస్తున్నారని గర్హించారు.మరో వైపు పార్టీపైనే తప్పడు కేసుల్ని బనాయిస్తున్నారని ఆక్రోశించారు.