అణచివేతకు బాబు నిర్వచనం

అణచివేతకు బాబు నిర్వచనం

అమరావతి: ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలను, మా పార్టీ నాయకులను కలవాలనుకుంటే ప్రభుత్వం ఎందుకు ఇన్ని ఆంక్షలు పెడుతోందని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. గురువారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు. ‘నిన్న గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో తాను పర్యటిస్తే పోలీసు బలగాలను మోహరించి ఎక్కడికక్కడ ప్రజలను అడ్డుకున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ ఏడాది కాలంలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.  బహుశా దేశ చరిత్రలో ఇంత వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది.  రాష్ట్రంలో అణచివేత అనే పదానికి చంద్రబాబు నిర్వచనంగా మారార’ని దుయ్యబట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos