చంద్రబాబు ఓ గజ దొంగ : జగన్‌

కర్నూలు: చంద్ర బాబు నాయుడు గజదొంగ, బంది పోటులా రాష్ట్రాన్ని దోచేశారని, అత్యంత అన్యాయమైన  పరిపాలన సాగిస్తున్నారని వైకాప  అధినేత జగన్ ధ్వజ మెత్తారు. సోమ వారం ఉదయం  కర్నూలు జిల్లా ఓర్వకల్లులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. దొంగే దొంగ అన్నట్లుగా చంద్రబాబు తీరు ఉందని ఎద్దేవా చేశారు. మరో ఇరవై రోజులు కట్టు కథలు పిట్ట కథలు చెప్పి జనాన్ని మభ్య పరచేందుకు విపరీతంగా శ్రమి స్తారని దుయ్యబట్టారు.  గ్రామాలకు డబ్బు సంచులు పంపి ఒక్కో  ఓటుకు రూ.మూడు వేలు ఇస్తారని ఆరోపించారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని లెక్కలేనన్ని మోసాలు పాల్పడుతున్నారని  ధ్వజ మెత్తారు. ఓటర్ల జాబితా నుంచి అర్హులైన పౌరుల పేర్లు తొలగించి  దొంగ ఓటర్ల పేర్లు నమోదు చేశారనిఆరోపించారు. ప్రజల ఆధార్‌ డేటా చోరీ చేయటం చంద్ర బాబు అత్యంత సంస్కార హీన చర్యని  మండి పడ్డారు. ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి ఏమాత్రం లేదని విమర్శించారు. పొదుపు సంఘాల్లో ఉన్న అక్కాచెల్లెళ్లు, రైతులు, విద్యార్థులకు ప్రభుత్వం ఏం న్యాయం చేసిందని ధ్వజ మెత్తారు.  పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆవేదనకు అంతులేకుండా పోయిందని ఆక్రోశించారు. ‘పాదయాత్రలో రైతుల కష్టాలను తెలుసుకున్నా. ప్రభుత్వం వచ్చి ఐదేళ్లు గడిచినా వారికి ఇంత వరకూ కనీస మద్దతు ధర ఇవ్వలేదు. ప్రతి గ్రామంలో రెండు మూడు మద్యం దుకాణాలు ఉన్నాయి. చిల్లర అంగళ్లలో కూడా మద్యం దొరుకుతోంది.  విచ్చల విడిగా బెల్టు దుకాణాలు నిర్వహిస్తుండటాన్నిపాదయాత్రలో గమనించా.విద్యార్థులు తమ చదువులకు ఫీజులు కట్ట లేని దుస్థితిలో ఉన్నారు.పిల్లల చదువుల కోసం తల్లి దండ్రులు ఆస్తు లమ్ముకుంటున్నారు. కొందరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. నిరుద్యోగాన్ని భరించ లేక యువకులు పడుతున్న ఆవేదనను చూశా. వీరందరి సమస్యలు నేను విన్నాను.వాటిని పరిష్క రించేందుకు మీ అందరికీ నేనున్నాను’ అని భరోసా ఇచ్చారు. ఆరోగ్యశ్రీ పని చేయడం లేదని, ఆంబులెన్సులు రోగుల్ని సురక్షితంగా ఆస్పత్రులకు చేర్చేందుకు తగిన వేళకు రావడం లేదని ఆరోపించారు.ఎన్నికలకు మూడునెలల ముందు ఫించన్లు పెంచారని విమర్శించారు. లంఛాలు ఇవ్వకుండా  ఫించను, చౌక డిపో పత్రాలు దక్కవని దుయ్య బట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos