ఆలయాల పునఃనిర్మా ణానికి జగన్‌ భూమిపూజ

ఆలయాల పునఃనిర్మా ణానికి జగన్‌ భూమిపూజ

విజయవాడ: నగరంలో 9 ఆలయాల పునఃనిర్మాణానికి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. రూ.77 కోట్లతో దుర్గుగుడి అభివృద్ధి, విస్తరణ పనులకు శంకు స్థాపన చేశారు. కృష్ణా నది తీరంలో గతంలో ఉన్న 9 ఆలయాలను 2016 పుష్కరాల సమయంలో తొలగించారు. ప్రస్తుతం వాటిని తిరిగి అదే స్థానంలో నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దక్షిణముఖ ఆంజనేయస్వామి, సీతమ్మవారి పాదాలు, రాహు-కేతువు, బొడ్డుబొమ్మ, గోశాల కృష్టుడి ఆలయం, కృష్ణా నది ఒడ్డున సీతమ్మ పాదాల వద్ద ఆలయాల పునర్నిర్మాణానికి , రూ.77 కోట్లతో ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆలయాల నిర్మాణం దేవాదాయ శాఖ, సుందరీకరణ పనులను పురపాలక శాఖ చేపడుతుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos