విశాఖపట్నం: ప్రముఖ తెలుగు రచయిత్రి జగద్ధాత్రి శనివారం ఇక్కడ తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రచయిత, భర్త రామతీర్థ మరణం తర్వాత ఆమె మానసికంగా కుంగిపోయి ఈ చర్యకు పాల్పడినట్లు ఆత్మీయులు భావిస్తున్నారు. తనకు సంబంధించిన వస్తు వులను అన్నింటిని రాజేష్ అనే యువకుడిగా ఇవ్వాల్సిందిగా ఆమె లేఖ రాసినట్లు చెబుతున్నారు. రాజేష్ ఆమెకు నిత్య జీవితంలో చేదోడు వాదో డుగా ఉంటున్నారు. తన మరణానికి ఎవరూ బాధ్యులు కారనీ మరో లేఖ రాసినట్లు తెలిసింది. ఈ లేఖల్ని స్థానిక పోలీసులు స్వాధీనం చేసు కున్న ట్లు సమాచారం. ఆమె కవిత్వంతో పాటు విమర్శనా వ్యాసాలూ రాశారు. అనువాదాలూ చేశారు. కావ్య జ్యోతి పేరిట అనువాద కవితలతో ఒక ప్రముఖ దినపత్రికలో కాలమ్ నిర్వహించారు. మొజాయిక్ లిటరరీ అసోసియేషన్ లో చురుకైన పాత్ర పోషించారు. వక్షస్థలే అనే కథకు ఆమె ఆర్ఎస్ కృష్ణ మూర్తి పురస్కారాన్ని అందుకున్నారు. ఆమె మృతికి తెలుగు సాహిత్య లోకం నివ్వెరపోయింది.